Kathi Mahesh: కత్తి మహేశ్ పై కేసు పెట్టాలని పోలీసులకు కోర్టు ఆదేశం!

  • హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి
  • కేసు నమోదుకు నిరాకరించిన పోలీసులు
  • హిందూ వాహిని పిటిషన్ తో స్పందించిన కోర్టు
సినీ విశ్లేషకుడు, నిత్యమూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కత్తి మహేశ్ పై కేసు పెట్టాలని తెనాలి కోర్టు పోలీసులను ఆదేశించింది. జూన్ 29న ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న ఆయన, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రామాయణాన్ని, సీతారాములను కించపరిచాడని ఆరోపిస్తూ, హిందూవాహిని ప్రతినిధులు కొందరు పోలీసులను ఆశ్రయించారు.

అయితే, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో సంఘం అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, కేసు నమోదుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడుతూ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Kathi Mahesh
Court
Tenali
Hindu Vahini
Police
Case

More Telugu News