Police: పోలీసుల డెకాయ్ ఆపరేషన్... బంగ్లాదేశ్ యువతి అదుపులోకి!

  • జూబ్లీహిల్స్ లోని ఇంట్లో వ్యభిచారం
  • కానిస్టేబుల్ కు డబ్బిచ్చి పంపిన పోలీసులు
  • ఆపై దాడి చేసి అరెస్ట్
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి బంగ్లాదేశ్ కు చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. హైలం కాలనీకి చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి, వరుణ్ అనే పనివాడి సహకారంతో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా, ఈ దందాపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.

దాంతో ఉన్నతాధికారులు ఓ కానిస్టేబుల్ కు డబ్బులు ఇచ్చి, కస్టమర్ గా ఆ గృహానికి పంపించారు. డబ్బు తీసుకున్న వరుణ్, బంగ్లాదేశ్ యువతిని కానిస్టేబుల్ వద్దకు పంపాడు. ఆపై అతనిచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు చేసి వరుణ్ ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన యువతిని రెస్క్యూ హోమ్ కు పంపించారు. గృహ నిర్వాహకుడు మనోజ్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Police
Hyderabad
Arrest
Bangladesh
Prostitution

More Telugu News