Odisha: కామెంట్ చేసిన రోమియోను నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన యువతి!

  • ఒడిశాలోని బరంపురంలో ఘటన
  • కాలేజీకి వెళుతుంటే అసభ్య పదజాలం
  • నలుగురి ముందూ వాయించిన యువతి

రోడ్డుపై కాలేజీకి వెళుతున్న ఓ డిగ్రీ విద్యార్థినిపై కామెంట్ చేసిన ఓ రోమియోకు తగిన శాస్తి జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఒడిశాలోని బరంపురానికి చెందిన ఓ యువతి మహామాయి మహిళా కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమె కాలేజీకి వెళుతుండగా, రోడ్డుపై ఒకడు అసభ్య పదజాలాన్ని వాడాడు. అందరిమాదిరిగా బాధతో వెళ్లిపోకుండా, ఆమె అతన్ని ప్రతిఘటించింది. తన చెప్పు తీసి, వాడి చొక్కా పట్టుకుని మరీ కొట్టింది.  

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను, వీడియోలను తమ స్మార్ట్ ఫోన్లలో తీసిన కొందరు, వాటిని సోషల్ మీడియాలో పంచుకోగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. గత రెండు రోజులుగా ఒడియా టీవీ చానళ్లు ఈ దృశ్యాలను పదేపదే చూపించాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర హోమ్ మంత్రిత్వ శాఖ, తక్షణం ఆ రోమియోను అరెస్ట్ చేయాలని బరంపురం టౌన్ పోలీసులను ఆదేశించింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి ఎస్‌డీజేఎం కోర్టులో హాజరు పరిచి కటకటాల వెనక్కు పంపారు.

  • Loading...

More Telugu News