Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఇక్కడ సలహాలు పనిచేయవంటున్న తమన్నా
  • ఏఎన్నార్ పాత్ర గురించి సుమంత్
  • దేవాలయంలో షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్

*  ఇక్కడ ఒకరికి మరొకరు సలహాలు ఇవ్వడం ఏమాత్రం కుదిరే పనికాదు.. అంటోంది మిల్కీ వైట్ భామ తమన్నా. 'సినిమా ఇండస్ట్రీలో సలహాలు ఇవ్వలేం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులు మారిపోతుంటాయి. అందుకని ఈ రోజు మనం ఇచ్చే సలహా రేపటికి పనిచేయదు. ఎవరికి వారు పరిస్థితులను బట్టి వెళ్లిపోతుండాలి. అందుకని నేను కూడా ఎవరికీ సలహాలు ఇవ్వను' అని చెప్పింది.
*  'ఎన్టీఆర్' బయోపిక్ లో తాను లెజండరీ యాక్టర్ ఏఎన్నార్ పాత్రను పోషిస్తున్నట్టు సుమంత్ కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రంలో సుమంత్ నటించడం లేదంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్న నేపథ్యంలో సుమంత్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. 'ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ చిత్రంలో మా తాతగారు ఏఎన్నార్ పాత్రను పోషించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను, చాలా ఎగ్జయిట్ అవుతున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.
*  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'అరవింద సమేత' చిత్రం షూటింగ్ హైదరాబాదు పరిసరాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఓ దేవాలయంలో హీరో హీరోయిన్లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెలలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళతారు. 

  • Loading...

More Telugu News