pv sindhu: దుమ్మురేపిన పీవీ సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరిన తెలుగు తేజం

  • ఛాంపియన్ షిప్ కు మరో అడుగు దూరంలో సింధు
  • సెమీస్ లో యమగుచిపై జయకేతనం
  • ఫైనల్స్ లో వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్ తో పోరు
భారత్ స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తన ఫామ్ ను కొనసాగిస్తోంది. జపాన్ షట్లర్ యమగుచిపై జరిగిన సెమీ ఫైనల్స్ లో సింధు జయకేతనం ఎగురవేసింది. 21-16, 24-22 తేడాతో యమగుచిని సింధు ఓడించింది. ఈ విజయంతో వరుసగా రెండో ఏడాది సింధు ఫైనల్స్ లో అడుగుపెట్టింది. రేపు జరగనున్న ఫైనల్స్ లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తో ఆమె తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్రపంచ ఛాంపియన్ షిప్ ఆమె సొంతమవుతుంది. 
pv sindhu
world badminton championship
finals

More Telugu News