Karakkaya case: కరక్కాయల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్!

  • అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
  • బాధితులకు రూ.10 నుంచి 20 కోట్ల మేర కుచ్చుటోపి
  • మరికాసేపట్లో మీడియా ముందుకు

కరక్కాయ పొడి పేరిట వందలాది మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మల్లికార్జున్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. కరక్కాయను పొడిచేసి ఇస్తే భారీగా నగదును ఇస్తామని చెప్పడంతో చాలామంది లక్షలాది రూపాయలు వెచ్చించి వీటిని కొనుగోలు చేశారు. తీరా మోసం బయటపడటంతో లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు.

వైజాగ్, వరంగల్ సహా పలు ప్రాంతాలకు చెందిన వారిని ఈ ముఠా సిండికేట్ గా ఏర్పడి మోసం చేసింది. ప్రస్తుతం ఈ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్నఆరుగురు సభ్యుల్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అరెస్ట్ చేసిన మల్లికార్జున్ రెడ్డి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అధికారుల లెక్కల ప్రకారం ఈ ముఠా ప్రజల నుంచి రూ. 10 నుంచి 20 కోట్ల మేర మోసం చేసింది. మరికాసేపట్లో నిందితుల్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News