సైనా విఫలమైన వేళ... డిఫెండింగ్ చాంపియన్ పై గర్జించిన సింధు!
- ఒకుహరాపై ఘన విజయం
- 21-17, 21-19 తేడాతో విజయం
- కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయిన సైనా నెహ్వాల్
క్వార్టర్ ఫైనల్ లో మూడో సీడ్ గా బరిలోకి దిగిన సింధు.. ఒకుహరాపై 21-17, 21-19 తేడాతో విజయం సాధించింది. ఇదే సమయంలో మరో భారత స్టార్ సైనా నెహ్వాల్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. పదో సీడ్ గా బరిలోకి దిగిన సైనా పెద్దగా పోటీ ఇవ్వకుండానే 21-6, 21-11తో ఘోరంగా ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ లో తలపడిన సాయి ప్ర్రణీత్ సైతం ఓడిపోయాడు.