Imran khan: ఇమ్రాన్ ఖాన్ కు సమన్లు జారీ చేసిన అవినీతి వ్యతిరేక విభాగం

  • 2013 నుంచి ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్ లో అధికారంలో ఉన్న పీటీఐ
  • ప్రభుత్వ హెలికాప్టర్ ను వాడి ఖజానాకు నష్టం చేకూర్చారంటూ ఆరోపణలు
  • విచారణ జరుపుతున్న ఎన్ఏబీ

ఈనెల 11న పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించనున్న ఇమ్రాన్ ఖాన్ కు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (అవినీతి వ్యతిరేక విభాగం) సమన్లను జారీ చేసింది. ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్ ఖజానాకు రూ. 2.17 మిలియన్ల నష్టాన్ని కలిగించారనే ఆరోపణలతో ఆయనకు సమన్లను పంపించింది.

2013 నుంచి ఈ ప్రావిన్స్ లో ఇమ్రాన్ కు చెందిన పీటీఐ అధికారంలో ఉంది. ఈ ప్రావిన్స్ కు చెందిన ప్రభుత్వ హెలికాప్టర్ ను ఇమ్రాన్ 72 గంటల పాటు ఉపయోగించారని, దీంతో ఖజానాకు నష్టం కలిగిందనేది ఇమ్రాన్ పై ఉన్న అభియోగం. జూలై 18నే ఇమ్రాన్ కు అవినీతి వ్యతిరేక విభాగం సమన్లను జారీ చేసింది. అయితే, ఎన్నికల బిజీ వల్ల ఎన్ఏబీ ప్యానెల్ ఎదుట ఆయన హాజరు కాలేదు. ఎన్నికల తర్వాత తేదీ ఖరారు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరడంతో... ఆ తేదీని ఆగస్టు 7కు మార్చింది.

More Telugu News