charan: ఆర్యన్ రాజేశ్ కి నెగిటివ్ రోల్ ఇచ్చిన బోయపాటి!

  • యాక్షన్ ఎంటర్టైనర్ గా చరణ్ మూవీ 
  • విలన్ గా వివేక్ ఒబెరాయ్ 
  • కొత్తగా కనిపించనున్న ఆర్యన్ రాజేశ్

చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమా చేస్తున్నాడు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఆర్యన్ రాజేశ్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆ పాత్ర ఎలా వుండనుందోననే ఆసక్తి అందరిలోను మొదలైంది.

ఈ సినిమాలో ఆర్యన్ రాజేశ్ నెగిటివ్ రోల్ చేయనున్నాడనేది తాజా సమాచారం. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా .. ప్రత్యేకత కలిగిన మరో నెగెటివ్ రోల్ లో ఆర్యన్ రాజేశ్ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రను బోయపాటి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడనీ, ఆర్యన్ రాజేశ్ ను కొత్తగా చూపించనున్నాడని అంటున్నారు. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోన్న ఆర్యన్ రాజేశ్ , ఈ సినిమాతో బిజీ అవుతాడేమో చూడాలి.     

More Telugu News