ajay ghosh: 'బాహుబలి'లో నా సీన్స్ తీసేశారు .. నేనేం ఫీల్ కాలేదు: నటుడు అజయ్ ఘోష్

  • విలన్ కి తగిన రూపం ఆయనది 
  • గంభీరమైన వాయిస్ ఆయన సొంతం 
  • విభిన్నమైన పాత్రల్లో విలక్షణమైన నటన  
చూడగానే విలన్ లా కనిపిస్తాడు .. గంభీరమైన ఆయన వాయిస్ కూడా ఆ తరహా పాత్రలకే ఎక్కువగా సూట్ అవుతుంది. అలా అని చెప్పేసి ఆయన విలన్ పాత్రలను మాత్రమే చేయలేదు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు .. ఆయనే అజయ్ ఘోష్. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

"నేను 'బాహుబలి' సినిమా చేశాను .. ఆ విషయం కొంతమందికి చెప్పాను .. వాళ్ల ద్వారా చాలామందికి తెలిసింది. ఆ సినిమాలో నేను చేసిన సీన్స్ ను నిడివి పెరిగిన కారణంగా తీసేశారు .. దానికి నేనేమీ ఫీల్ కాలేదు. కానీ అందరూ 'బాహుబలి' చేశానని చెప్పావు కదా .. ఎక్కడా కనిపించలేదు ..' అని అడగడం మొదలు పెట్టారు. 'ఆ సీన్స్ ను తీసేశారు' అని వాళ్లకి నేను చెప్పుకుంటూ రావలసి వచ్చింది. 'అబ్బా .. భలే ఛాన్స్ పోయింది' అంటూ అవతలవాళ్లు ఫీలయ్యే వాళ్లు .. నిడివి ఎక్కువైతే కొన్ని సీన్స్ ను లేపేస్తారనే సంగతి వాళ్లకి తెలియదు కదా" అంటూ చెప్పుకొచ్చారు.   
ajay ghosh

More Telugu News