DS: విద్యార్థినుల లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన డీఎస్ కుమారుడు సంజయ్

  • ఆరోపణలన్నీ అవాస్తవం
  • రాజకీయంగా దెబ్బతీయాలని కొందరి కుట్ర
  • పోలీసుల విచారణకు సహకరిస్తా
  • నిజామాబాద్ లో సంజయ్
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలన్నీ అవాస్తవమని డీఎస్ కుమారుడు సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర ఈ ఆరోపణల వెనకుందని అన్నారు. తాను ఏ విద్యార్థినినీ లైంగికంగా వేధించలేదని, వారంతా తన ఇంటి బిడ్డల వంటి వారని వ్యాఖ్యానించిన సంజయ్, తాను ఎవరితోనూ సహజీవనం చేయట్లేదని స్పష్టం చేశారు.

తనపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా తనకుందని చెప్పారు. కాగా, తాను నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులను తన గదికి పిలిపించుకుని, వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు సంజయ్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
DS
Sanjay
Harrasment

More Telugu News