tablets: స్కూల్ ట్యాబ్లెట్స్ లో అశ్లీల చిత్రాలు.. ఛత్తీస్ గఢ్ లో వణికిపోతున్న మహిళా టీచర్లు!

  • పోర్న్ సైట్ ను ఓపెన్ చేసిన టీచర్
  • అన్ని ట్యాబ్లెట్స్ కు పాకిన వైరస్
  • వాడొద్దని జిల్లా యంత్రాంగం ఆదేశం

టెక్నాలజీని సరిగ్గా వాడుకోకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో చెప్పేందుకు తాజా ఉదాహరణే ఈ ఘటన. ఛత్తీస్ గఢ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు కేంద్రం గతేడాది ట్యాబ్లెట్స్ ను అందించింది. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయి.

అయతే రాయ్ పూర్ జిల్లాలోని ఓ టీచర్ వీటి ద్వారా పోర్న్ సైట్లు చూడటంతో అసలు సమస్య మొదలైంది. సదరు సైట్లను ఓపెన్ చేయడంతో వాటిలోని వైరస్ అన్ని ట్యాబ్లెట్లకు సోకింది. దీంతో వీటిని ఆన్ చేయగానే తెరపై అశ్లీల చిత్రాల పాప్అప్స్ రావడం మొదలుపెట్టాయి. ఈ అశ్లీల చిత్రాల నేపథ్యంలో ట్యాబ్లెట్లను వినియోగించేందుకు మహిళా టీచర్లు నిరాకరిస్తున్నారు. కనీసం బయోమెట్రిక్ ఇచ్చేందుకు కూడా వారు ముందుకు రావడం లేదు.

దీంతో సమస్యను పరిష్కరించేవరకూ ఈ ట్యాబ్లెట్స్ ను వాడొద్దని రాయ్ పూర్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. ‘శాలా కోశ్’ ప్రాజెక్ట్ కింద కేంద్ర మానవవనరుల శాఖ ఛత్తీస్ గఢ్ కు 51,000 ట్యాబ్లెట్స్ ను అందించింది. 

More Telugu News