nama nageswara rao: ఓటమి తర్వాత వచ్చేది గెలుపే: నామా నాగేశ్వరరావు

  • ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉంది
  • కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదు
  • నేను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను

టీడీపీ కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని... అందరికీ పార్టీ అండగా ఉంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో టీడీపీకి మంచి పట్టు ఉందని... ఓటమి తర్వాత వచ్చేది గెలుపేనని చెప్పారు. కష్టకాలంలో సైతం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు. మన కష్టాలు తొలగిపోవాలంటే పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ప్రతి కార్యకర్త తీసుకోవాలని చెప్పారు.

అధికారం శాశ్వతం కాదని, మంచి వ్యక్తులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయడానికే వచ్చానని చెప్పారు. బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామంలో నిర్వహించిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, పాలేరు, మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News