Jayalalitha: ఆ వీడియో నిజమైనదే.. జయలలిత ‘జ్యూస్’ వీడియోపై వెట్రివేల్ స్పందన

  • వీడియోలో జ్యూస్ తాగుతూ కనిపించిన జయ
  • అది నకిలీదన్న కమిషన్ కార్యదర్శి కోమల
  • కాదన్న దినకరన్ అనుచరుడు వెట్రివేల్

అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత జ్యూస్ తాగుతూ, టీవీ చూస్తున్నట్టు ఉన్న వీడియో ఒకటి అప్పట్లో బయటకు వచ్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో ఈ వీడియో బయటకు రావడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జస్టిస్ అర్ముగస్వామి ఆధ్వర్యంలోని కమిటీ ఇటీవల ఈ వీడియోను నకిలీదిగా తేల్చింది. విచారణ కమిషన్ కార్యదర్శి కోమల అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స తీసుకున్న గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా గదిలో టీవీ అమర్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇది పూర్తిగా నకిలీ వీడియో అని తేల్చారు.

ఈ వీడియో విషయంపై తాజాగా టీటీవీ దినకరన్ మద్దతుదారుడు వెట్రివేల్ స్పందించారు. అది నిజమైన వీడియోనే అని, మార్ఫింగ్ చేయలేదని స్పష్టం చేశారు. తాను ఈ వీడియోను విడుదల చేసి 9 నెలలు అయిందని, అది మార్ఫింగ్ చేసినదే అయితే ఇప్పటి వరకు తనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వీడియోపై కోమల అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి కోమల సన్నిహితురాలని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News