imran khan: భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటా: కపిల్ దేవ్

  • మాజీ క్రికెటర్లకు ఇమ్రాన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి 
  • ఇన్విటేషన్ వస్తే ముందుగా ప్రభుత్వంతో చర్చిస్తానన్న కపిల్ 
  • తాను వెళుతున్నట్టు సిద్ధూ ఇప్పటికే ప్రకటన 
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చేయనున్న ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే విషయంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆచితూచి మాట్లాడాడు. తనకు ఇమ్రాన్ నుంచి ఆహ్వానం వస్తే కనుక ముందుగా భారత ప్రభుత్వంతో చర్చిస్తానని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఈ నెల 11న పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సిద్ధూలకు ఆహ్వానాలు వెళ్లాయి. పాకిస్థాన్ కు వెళ్తున్నానని సిద్ధూ ఇప్పటికే ప్రకటించగా... గవాస్కర్ ఇంకా స్పందించలేదు.
imran khan
Pakistan
oath
kapil dev
gavaskar
navjot sidhu

More Telugu News