jena sena: జనసేన పార్టీ పక్ష పత్రిక ‘శతఘ్ని’ విడుదల!

  • ‘జనసేన’ కరదీపిక, పక్షపత్రికను విడుదల చేసిన పవన్
  • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా కరదీపిక
  • ‘జనసేన’ సంకల్పం తెలియచేసేందుకు ‘శతఘ్ని’

జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను,
ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు విడుదల చేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కరదీపికను, పార్టీ తరఫున ప్రారంభించిన పక్ష పత్రిక 'శతఘ్ని'ని ఆయన విడుదల చేశారు. పార్టీ శ్రేణులకు సిద్ధాంతాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారికి దిశానిర్దేశం చేసేలా కరదీపిక ఉంటుందని, ‘జనసేన’ సంకల్పం ఏమిటనేది ప్రతి పాఠకుడికి తెలియచేసేలా ‘శతఘ్ని’ ఉంటుందని పవన్ అన్నారు.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘జనసేన’కు సంబంధించిన విషయాలను తెలియచేసేందుకు 'శతఘ్ని' పేరిట పక్ష పత్రికను తీసుకు వస్తున్నామని అన్నారు. బలమైన సిద్ధాంతాలు ఉన్న ఒకే ఒక్క పార్టీ ‘జనసేన’ అని, టీడీపీ, వైసీపీలకు సిద్ధాంతాలు లేవని విమర్శించారు. ‘జనసేన’ అధ్యక్షుడు ఏడు సిద్ధాంతాలను మనకు అందించారని, అవినీతి రహిత సమాజం స్థాపనే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. డిసెంబర్ నెలాఖరుకి 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలనీ  పార్టీ శ్రేణులకు లక్ష్యంగా నిర్ణయించామని, ఈ నెలలోనే 'వాడవాడ జనసేన జెండా' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం, మండల కేంద్రం, గ్రామం, బూత్ స్థాయిలో ‘జనసేన’ జెండా ఎగరాలి’ అని అన్నారు.  

  • Loading...

More Telugu News