Pawan Kalyan: ఆ సమయంలో మా వదిన ఇచ్చిన ధైర్యం మరిచిపోలేను!: పవన్ కల్యాణ్

  • నాకు చదువు ఇబ్బందిగా మారితే ఆమె ధైర్యం చెప్పింది
  • మా అమ్మ, అక్కాచెల్లెళ్లు, వదిన... మధ్య పెరిగాను
  • భవిష్యత్ తరాలకు మంచి సమాజాన్ని అందిద్దాం

తనను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించినా, తిట్టినా పట్టించుకోనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.  హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో 'వీర మహిళ విభాగం' సమావేశంలో పవన్ మాట్లాడుతూ, ‘జగన్ ఈ మధ్యన నా వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించారు. నేను కూడా అంతే స్థాయిలో అనొచ్చు. కానీ, నాకు వారి ఇంట్లోని ఆడపడుచులు, తల్లి, బిడ్డలు గుర్తుకొస్తారు. నేను జగన్ గారిని వ్యక్తిగతంగా అంటే వారి ఇంట్లోవారు ఎంత బాధపడతారో గ్రహించగలను.

ఓ అమ్మాయి నన్ను తిట్టినా నేను అలాగే ఆలోచించాను. మా అమ్మగారు, అక్కాచెల్లెళ్లు, వదిన... వీరందరి మధ్య పెరిగినవాణ్ణి. నాకు చదువు ఇబ్బందిగా మారి, మనసుకు ఎక్కని పరిస్థితుల్లో వదిన గారు ఇచ్చిన ధైర్యం మరిచిపోలేనిది. ఇక ఈ పార్టీలోకి అందరం విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళమే. అందరూ సుహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేద్దాం. దీర్ఘకాలిక ఫలితాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళదాం. మన భవిష్యత్ తరాలకు మంచి సమాజం, పటిష్టమైన విధానాలను అందిద్దాం’ అని పవన్ పిలుపు నిచ్చారు. 

More Telugu News