jagan: జగన్ ను సన్మానించిన కాపు సామాజికవర్గ మహిళలు

  • గొల్లప్రోలు మండలంలో జగన్ ను కలిసిన కాపు సామాజికవర్గ మహిళలు
  • శాలువా కప్పి సన్మానం
  • కాపుల సంక్షేమానికి 10 వేల కోట్లు ఇస్తానన్నందుకు అభినందనలు
వైసీపీ అధినేత జగన్ ను కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలు సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్ ను కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలు కలిశారు. వీరిలో వైసీపీ నాయకురాళ్లు జక్కంపూడి విజయలక్ష్మి, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పి.పద్మావతి, చిట్నీడి సత్యవతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సన్మానించారు. కాపులకు జగన్ ఇచ్చిన హామీలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, శుష్క వాగ్దానాలు చేయకుండా, అమలు చేయగల హామీలను మాత్రమే జగన్ ఇస్తున్నారని కొనియాడారు. కాపుల సంక్షేమానికి రూ. 10 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. 
jagan
kapu
women

More Telugu News