shraddha kapoor: శ్రద్ధా కపూర్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సైనా నెహ్వాల్

  • సైనా నెహ్వాల్ బయోపిక్ లో శ్రద్ధా కపూర్
  • కొనసాగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • బ్యాడ్మింటన్ శిక్షణకి వెళ్లని శ్రద్ధా కపూర్       

కొంతకాలంగా బాలీవుడ్లో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. కొన్ని బయోపిక్ లు భారీ వసూళ్లను సాధించడంతో, మరి కొన్ని బయోపిక్ లు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా కూడా ఒక సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను రూపొందిస్తోన్న అమోల్ గుప్తా ..  సైనా నెహ్వాల్ పాత్రకిగాను శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసుకున్నారు.

తాజాగా ఈ ప్రాజెక్టును గురించి సైనా నెహ్వాల్ స్పందించారు. "ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి ఏడాదికి పైగా అవుతోంది. నా పాత్రను పోషించనున్న శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకోవలసి వుంది. ఆమె శిక్షణ పూర్తయిన తరువాతనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి ఉంటుంది. కానీ ఆమె ఈ ప్రాజెక్టుపై దృష్టిపెట్టడం లేదు" అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పాక వరుస అవకాశాలు రావడంతో శ్రద్ధా కపూర్ బాగా బిజీ అయింది. అందువల్లనే బ్యాడ్మింటన్ శిక్షణకి సమయాన్ని కేటాయించలేకపోతోందనేది ఆమె సన్నిహితుల మాట.       

More Telugu News