Bihar Munger: 30 గంటల సుదీర్ఘ ఆపరేషన్ సక్సెస్... బోరుబావిలో పడ్డ చిన్నారి క్షేమం

  • బీహార్ లోని ముంగేర్ సమీపంలో ఘటన
  • మంగళవారం సాయంత్రం బోరుబావిలో పడ్డ చిన్నారి
  • గత రాత్రి క్షేమంగా బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

బీహార్ లోని ముంగేర్ సమీపంలో బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని ఎన్డీఅర్ఎఫ్ సిబ్బంది 30 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. ముర్గియాచెక్ పట్టణంలోని తన తల్లిదండ్రులతో కలసి వచ్చిన సానో అనే పాప, మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే.

పాప 45 అడుగుల లోతులో ఉందని గుర్తించిన అధికారులు... తొలుత 30 అడుగుల లోతైన గుంతను సమాంతరంగా తవ్వారు. ఆపై మరో 15 అడుగులను అడ్డంగా తవ్వుతూ వెళ్లి పాపను చేరారు. సహాయక చర్యలను సీఎం నితీశ్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని ముంగేర్ ఎస్పీ గౌరవ్ మంగ్లా వెల్లడించారు. పాపను ప్రాణాలతో బయటకు తీసిన సిబ్బందిని ఆయన అభినందించారు.

More Telugu News