modi: మోదీ ఏ మాయ చేశారో వాళ్లిద్దరూ చెప్పాలి?: మంత్రి యనమల

  • ప్రధాని ఏ మాయ చేశారో జగన్, పవన్ లు చెప్పాలి?
  • వాళ్లిద్దరి దృష్టి సీఎం కుర్చీపైనే ఉంది
  • మాట తప్పే విషయంలో జగన్ కు ఎవరూ సాటిలేరు
వైసీపీ, జనసేన పార్టీల అధినేతలపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఏ మాయ చేశారో జగన్, పవన్ లు చెప్పాలి. సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్లపై ఆ ఇద్దరూ ఎందుకు స్పందించరు? మోదీ అప్రజాస్వామిక చర్యలపై ఎందుకు నోరుమెదపరు? అంటూ ప్రశ్నించారు. జగన్, పవన్.. వాళ్లిద్దరి దృష్టి సీఎం కుర్చీపైనే ఉందని, నియోజకవర్గానికో మాట, జిల్లాకో వైఖరి అవలంబించడం వైసీపీ విధానమని విమర్శించారు. మాట తప్పడం.. మడమ తిప్పడంలో జగన్ కు ఎవరూ సాటిలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు సబబు కాదని అన్నారు. అపరిపక్వత, అవగాహనా లేమి వున్నది బీజేపీ అధినాయకత్వానికేనని దుయ్యబట్టారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా బీజేపీ మోసాన్ని ఎండగట్టామని, వచ్చే ఎన్నికల్లో మోదీకి ప్రజలు మొండిచేయి చూపడం ఖాయమని అభిప్రాయపడ్డారు.
modi
Yanamala
Pawan Kalyan
Jagan

More Telugu News