Jagan: ప్రధాని మోదీయే నిర్ణయం తీసుకోవాలని మంత్రి బీరేంద్ర చెప్పారు: సీఎం రమేష్

  • ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి: సీఎం రమేష్
  • బీరేంద్ర సింగ్ మళ్లీ మొదటికొచ్చారు: సోమిరెడ్డి
  • కడపకు జగన్ చేసిందేమీ లేదు: ఆదినారాయణ రెడ్డి

కడపలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి బీరేంద్ర సింగ్ తన చేతిలో ఏమీ లేదని, ప్రధాని మోదీయే నిర్ణయం తీసుకోవాలని చెప్పారని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీరేంద్ర సింగ్ మళ్లీ మొదటికొచ్చారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అయినా అధికారిక ప్రకటన చేయాలని, లేదంటే చూస్తూ ఊరుకోమని సోమిరెడ్డి హెచ్చరించారు. తెలంగాణలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షనేతగా కడప జిల్లాకు జగన్ చేసిందేమీలేదని, జగన్ తో రాష్ట్రానికి దరిద్రం పట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.

కాగా, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఢిల్లీకి చేరిన విషయం తెలిసిందే. టీడీపీ, జేఏసీ, అఖిలపక్ష నేతలు, కడప జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లడం జరిగింది.

  • Loading...

More Telugu News