jonathan: ఇది లిపి వున్న కంటి భాష.. అద్భుతం సృష్టించిన చిచ్చరపిడుగు!

  • సెరెబ్రల్ పాల్సీ తో బాధపడుతున్న జోనాథన్
  • ట్రైన్ ఫ్రేమ్ బోర్డుతో పుస్తక రచన
  • సాయం చేసిన తల్లి చెంటన్

పిల్లలకు చిన్న జ్వరం వస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. చివరికి వాళ్లు తిరిగి ఆడుకునేవరకూ కన్నవాళ్ల ప్రాణం కుదుటపడదు. మరి కన్నకొడుకు జీవితాంతం కాళ్లు, చేతులు కదలించలేడనీ, మాట్లాడలేడని తెలిస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మిగతావారి సంగతేమో కానీ ఇంగ్లండ్ కు చెందిన చెంటన్ బ్రయాన్ అలా అనుకోలేదు. సెరెబ్రల్ పాల్సీ(కండరాలు చచ్చుపడిపోయే వ్యాధి)తో బాధ పడుతున్న తన కుమారుడు ఏదైనా సాధించగలడని నమ్మింది. తల్లి నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆ పిల్లాడు ఏకంగా ఓ పుస్తకం రాసి చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లండ్ కు చెందిన జోనాథన్ బ్రయాట్(12) పుట్టుకతో సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో బ్రయాన్ ఇతర పిల్లల్లా కూర్చొని చదవలేడని టీచర్లు చెప్పారు. కానీ తల్లి సాయంతో రోజూ స్కూల్ కు వచ్చే జోనాథన్ పాఠాలు వినేవాడు. మాటలు రాని అతను ‘ట్రైన్ ఫ్రేమ్’ అనే  కలర్ కోడింగ్ బోర్డ్ సాయంతో కంటి చూపు ద్వారా తన మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పేవాడు. ఇదే ట్రైన్ ఫ్రేమ్ సాయంతో జోనాథన్ కంటి సైగలు చేస్తుండగా.. అతని తల్లి చెంటన్ దాన్ని అర్థం చేసుకుని పుస్తకం రాసేది. ఇలా ఏడాది పాటు కష్టపడ్డ జోనాథన్.. ఐ కెన్ రైట్ (eye can write) పేరుతో పుస్తకాన్ని ప్రచురించాడు.

పూర్తయిన పుస్తకాన్ని గుండెలపై పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న జోనాథన్ ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. కాగా, ఆత్మవిశ్వాసం కారణంగానే జోనాథన్ ఈ అద్భుతాన్ని సాధించగలిగాడని అతని తల్లి చెంటన్ చెబుతోంది.

More Telugu News