aadi pinishetty: థ్రిల్లర్ మూవీగా 'నీవెవరో' .. రిలీజ్ డేట్ ఖరారు

  • కథానాయకుడిగా ఆది పినిశెట్టి 
  • నాయికలుగా తాప్సీ .. రితికా సింగ్
  • ఈ నెల 24వ తేదీన విడుదల 

ఆది పినిశెట్టి కథానాయకుడిగా .. తాప్సీ - రితికా సింగ్ కథానాయికలుగా 'నీవెవరో' రూపొందింది. హరనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. లవ్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా కొనసాగనున్నట్టు తెలుస్తోంది.

గతంలో ఈ తరహా సినిమాల్లో నటించిన అనుభవం ఆది పినిశెట్టితో పాటు తాప్సీ .. రితికా సింగ్ లకు వుంది. కోన వెంకట్ సమర్పిస్తోన్న ఈ సినిమా, అనూహ్యమైన మలుపులతో సాగుతుందని అంటున్నారు. ప్రధానమైన మూడు పాత్రలను చాలా వైవిధ్యభరితంగా తీర్చిదిద్దారట. ఈ ముగ్గురి కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లోనే మంచి కంటెంట్ వున్న సినిమాలు వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబడుతుందేమో చూడాలి.   

  • Loading...

More Telugu News