kiara advani: బాలీవుడ్ హీరో ప్రేమలో కైరా అద్వాని?

  • 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ గుర్తింపు  
  • సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం
  • గతంలో ఆలియా, జాక్వెలిన్ లతో అఫైర్ నడిపిన సిద్ధార్థ్
టాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన కైరా అద్వానీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా ఆమె మంచి గుర్తింపు పొందింది. తాజాగా ఆమె గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె ప్రేమలో పడిందనేదే ఆ వార్త.

ఇంతకు ముందు బాలీవుడ్ భామ ఆలియా భట్ తో సిద్ధార్థ్ ప్రేమాయణం నడిపాడు. కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అనంతరం మరో నటి జాక్వెలిన్ కు సిద్ధార్థ్ దగ్గరయ్యాడు. ఇప్పుడు కైరాతో ప్రేమాయణం నడుపుతున్నాడనేది బీ-టౌన్ టాక్. వీరిద్దరూ తరచుగా మీడియా కంటికి చిక్కుతున్నారు. ఇటీవలే కైరా బర్త్ డే పార్టీకి కూడా సిద్ధార్థ్ హాజరయ్యాడట.
kiara advani
sidharth malhotra
love
bollywood
mahesh babu
Bharath Ane Nenu
tollywood

More Telugu News