roja: మా దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చింది: రోజా

  • మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతించాలంటూ నిరసన వ్యక్తం చేశాం
  • తమ నిరసనకు ప్రభుత్వం దిగి వచ్చింది
  • రమణదీక్షితులును అవమానించి, తొలగించారు
తిరుమలలో మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించకపోతే తాము నిరసన వ్యక్తం చేశామని... దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులును అవమానపరిచి, తొలగించారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట అని అన్నారు. భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యవహరిస్తున్న వారిని టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

శ్రీవారి ఆభరణాలకు సంబంధించి భక్తుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని రోజా చెప్పారు. ఆభరణాల వివరాలను ఆన్ లైన్లో ఉంచాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్ అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆమె పైవ్యాఖ్యలు చేశారు. 
roja
ramana deekshitulu
Chandrababu

More Telugu News