Bonalu: అపార్థం చేసుకోవద్దు... ఆవేదనతోనే ఆ వ్యాఖ్యలు: జోగిని శ్యామల

  • బోనాల జాతర నాడు శ్యామల వ్యాఖ్యలతో కలకలం
  • ఆమెను ఆలయానికి ఆహ్వానించిన ఈఓ
  • తన మాటలను అపార్థం చేసుకోవద్దన్న శ్యామల
బోనాల జాతర సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఆవేదన ఉందే తప్ప, ఉద్దేశ పూర్వకంగా ఎలాంటి విమర్శలూ చేయలేదని జోగిని శ్యామల వ్యాఖ్యానించారు. ఈఓ అన్నపూర్ణ ఆహ్వానం మేరకు మహంకాళి ఆలయానికి వచ్చిన ఆమె, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, ప్రధాన గేటు వద్ద జరిగిన ఘటన తనను మనస్తాపానికి గురి చేసిందని, తన మాటలను అపార్థం చేసుకోవద్దని కోరారు.

 కాగా, నాలుగు రోజుల నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా తనను అవమానించారని, ఏర్పాట్లలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని జోగిని శ్యామల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెను ఆలయానికి పిలిపించిన ఈఓ, శ్యామలతో పూజలు చేయించి ప్రసాదాన్ని అందించారు.
Bonalu
Syamala
Jogini
Mahankali

More Telugu News