Multiplex: ఒక్క రూపాయి పెంచినా ఊరుకోబోము... మల్టీప్లెక్సుల్లో అమల్లోకి వచ్చిన ఎంఆర్పీ!

  • అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
  • రేపటి నుంచి ఆకస్మిత తనిఖీలు 
  • హెచ్చరించిన అకున్ సభర్వాల్

మల్టీప్లెక్సుల్లో ఆహార పదార్థాలు, తినుబండారాల ధరలను ఎమ్మార్పీకే విక్రయించాలన్న నిబంధనలు నేటి నుంచి అమలులోకి రాగా, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ విభాగం చీఫ్ కంట్రోలర్ అకున్ సబర్వాల్ థియేటర్లు, మల్టీప్లెక్సుల యజమానులను హెచ్చరించారు. గరిష్ఠ చిల్లర ధరలను సినీ ప్రేక్షకులకు, కస్టమర్లకు కనిపించేలా బోర్డుల ఏర్పాటు తప్పనిసరని ఆయన అన్నారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తమకు ప్రేక్షకుల నుంచి ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేపటి నుంచి హైదరాబాద్ పరిధిలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని, తప్పు జరుగుతున్నట్టు తేలితే, భారీ జరిమానా, జైలుశిక్ష తప్పదని చెప్పారు. జిల్లాల పరిధిలోని థియేటర్లలో నాలుగో తేదీ నుంచి సోదాలు ఉంటాయని అన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయాలు జరిపితే, వీడియోలు తీయాలని, వాటిని వాట్స్ యాప్ నంబర్ 73307 74444కు పంపాలని, టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

More Telugu News