mexico: టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం.. చుట్టుముట్టిన మంటలు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు!

  • వడగళ్ల వాన కారణంగా కూలిన విమానం
  • 80 మందికి గాయాలు
  • నమ్మలేనంత నిజంగా ఉందన్న ప్రయాణికులు

మెక్సికోలో టేకాఫ్ అవుతున్న విమానం కూలిన ఘటనలో వందమంది ప్రయాణికులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. వడగళ్ల వాన కారణంగా ఈ దుర్ఘటన సంభవించింది. విమానం కూలిన వెంటనే మంటలు చుట్టుముట్టాయి. అయితే, అదృష్టవశాత్తు అందులో ఉన్న 97 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

విమానం దురంగో నుంచి మెక్సికో సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాము ప్రాణాలతో బయటపడడం నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో 80 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News