Aadhar: ఆధార్ నంబర్ ఎవరికైనా వెల్లడించడం చట్ట వ్యతిరేకమే!: యూఐడీఏఐ

  • ఆధార్ ను చట్టబద్ధంగా మాత్రమే వినియోగించాలి
  • తనకు తానుగా బహిర్గతం చేయడం నేరమే
  • ట్రాయ్ చైర్మన్ శర్మ ఉదంతం తరువాత కీలక వ్యాఖ్యలు

ఆధార్ నంబరును ఎవరికైనా వెల్లడించడం చట్ట వ్యతిరేకమైన చర్య అవుతుందని, ఆధార్ సంఖ్యను చట్టబద్ధంగా మాత్రమే వినియోగించాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. తనకు తానుగా ఆధార్ సంఖ్యను సోషల్ మీడియాలో పంచుకోవడం నేరమని సంస్థ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇటీవల ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ, తన ఆధార్ సంఖ్యను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, తన వివరాలు తెలుసుకోగలిగితే చెప్పాలని, ఆధార్ బహిర్గతమైతే కలిగే నష్టమేదైనా ఉంటే తెలియజేయాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆపై నెటిజన్లు, హ్యాకర్లు శర్మ వ్యక్తిగత వివరాలను ఎన్నింటినో బహిర్గతం చేసి, ఆధార్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని తేల్చిన నేపథ్యంలో యూఐడీఏఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News