Gas cylinder: ప్రజల నెత్తిన మళ్లీ బండ.. పెరిగిన వంట గ్యాస్ ధరలు!

  • నెల రోజుల వ్యవధిలో రెండోసారి
  • సిలిండర్‌పై రూ.1.76 పెంపు 
  • మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి

వంట గ్యాస్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. రాయితీ వంట గ్యాస్ సిలిండర్‌ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.496.26గా ఉండగా దీనిపై రూ. 1.76 పెంచింది. పెరిగిన ధరతో కలుపుకుంటే సిలిండర్ ధర రూ.498.02కు చేరుకుంది. గత నెల 30న సిలిండర్‌పై రూ.2.71 పెంచిన ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే మరోసారి పెంచింది. జీఎస్టీ సవరణ, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం, రూపాయి మారక విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల గ్యాస్ ధర పెంచినట్టు ఐవోసీఎల్ తెలిపింది.

More Telugu News