karunanidhi: కోలుకుంటున్న కరుణానిధి.. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే!

  • కరుణానిధి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన
  • ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కరుణ
  • వైద్య సేవలకు ఆయన బాగా స్పందిస్తున్నారు

చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు ఈరోజు ఓ ప్రకటన చేశారు. ఈ నెల 28న బీపీ, పల్స్ పడిపోవడంతో కరుణానిధిని ఆసుపత్రిలో చేర్చారని, అప్పటి నుంచి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 29వ తేదీన శ్వాస తీసుకోవడంలో కరుణానిధి కొంత ఇబ్బంది పడ్డారని, ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని, వైద్య సేవలకు ఆయన  బాగా స్పందిస్తున్నారని తెలిపారు. మరికొన్ని రోజులు కరుణానిధికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News