Chandrababu: సినిమా షూటింగ్ లో మాదిరి జగన్ ఫొటోలు దిగుతారు: చంద్రబాబు విమర్శలు

  • జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతాడు
  • రోజూ ఒకట్రెండు గంటలు నడుస్తాడు
  • వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారు
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. విశాఖపట్టణం జిల్లా ఎస్.రాయవరం మండలంలోని గుడివాడలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతాడు. రోజూ ఒకట్రెండు గంటలు నడుస్తాడు. సినిమా షూటింగ్ లో మాదిరి జగన్ ఫొటోలు దిగుతారు. కేసుల మాఫీ కోసమే రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టాలని చూస్తున్నారు’ అంటూ చంద్రబాబు విమర్శించారు.

బీజేపీ చేసిన నమ్మకద్రోహానికి ప్రజలు ఎవరూ ఓటు వేయరని, జగన్, పవన్ లను అడ్డుబెట్టుకుని మళ్లీ మోసం చేయాలని బీజేపీ చూస్తోందని.. ‘ఖబడ్దార్..తెలుగు ప్రజల్ని మోసం చేయలేరు’ అని హెచ్చరించారు. జగన్, పవన్ లు బీజేపీ అధికారానికి దాసోహమయ్యారని మండిపడ్డారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీల అమలుకు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. వైసీపీ ఎంపీలు మాత్రం తమ వెన్ను చూపి రాజీనామాలు చేశారని, అసెంబ్లీకి కూడా రాని ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.   
Chandrababu
Jagan
Pawan Kalyan

More Telugu News