muchharla aruna: ఇకపై సినిమాలు చేయనని పెళ్లికి ముందే మాట ఇచ్చాను: ముచ్చర్ల అరుణ

  • మోహన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను 
  • ఆయన తన అభిప్రాయం చెప్పారు 
  • అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను 
తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ముచ్చర్ల అరుణ చాలా సినిమాలు చేశారు. వివాహమైన తరువాత సినిమాలకి దూరంగా వుంటూ వస్తున్నారు. పెళ్లి కాగానే సినిమాలు మానేయడానికి కారణమేమిటనే ప్రశ్న 'ఆలీతో సరదాగా'లో ఆమెకి ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. "మోహన్ .. మా పక్కింటికి వచ్చివెళుతూ వుండేవారు. ఆ సమయంలోనే ఆయనతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుందామని ముందుగా నేనే ఆయనని అడిగాను.

ఆ తరువాత ఒక రోజున ఆయన ఫోన్ చేసి .. పెళ్లి చేసుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదనీ .. అంతకుముందు నాతో మాట్లాడాలని అన్నారు. అలా మీట్ అయినప్పుడే .. పెళ్లి తరువాత సినిమాలు చేయకూడదని చెప్పారు. ఆలోచించుకుని చెబుతానని వచ్చేశాను. సినిమాలా? .. పెళ్లా? ఈ రెండు విషయాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఇంట్లో మా అమ్మ తరచూ పెళ్లి ప్రాముఖ్యతను గురించి చెబుతూ ఉండేది. జీవితంలో ఎవరికైనా తప్పకుండా ఒక తోడు కావాలని అంటూ వుండేది. ఆ సమయంలో ఆ మాటలు గుర్తొచ్చాయి .. అంతే, సినిమాలను పక్కన పెట్టేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చారు.  
muchharla aruna

More Telugu News