venu: నాకు కోపం చాలా ఎక్కువ .. అందువల్ల చాలామంది దూరమయ్యారు: కమెడియన్ వేణు

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో వేణు ఒకరు. ఇంకా ఇంతవరకూ తనకి సరైన పాత్ర పడలేదు అంటూ .. అలాంటి పాత్ర కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ముచ్చటించాడు. "నాకు కోపం చాలా ఎక్కువ .. అందువలన చాలామందిని దూరం చేసుకున్నాను. నాకు ముక్కుమీదనే కోపం ఉంటుంది .. దాంతో వెంటనే రియాక్ట్ అవుతాను. ఆ కోపం కొంతసేపే ఉంటుంది .. కానీ ఈ లోగా జరగాల్సింది జరిగిపోతుంది.

 కోపం తగ్గిన తరువాత .. అనవసరంగా కోప్పడ్డానే అనిపిస్తుంది. అప్పుడు అవతల వ్యక్తి చిన్నవాడైనా సరే వెళ్లి సారీ చెబుతాను. నేను ఒక వ్యక్తిపై కోప్పడటం హీరోల కంటపడినా .. సీనియర్ ఆర్టిస్టుల కంటబడినా నా గురించి చెడుగా అనుకుంటారేమోననేంత దూరం నేను ఆలోచించలేదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గించుకున్నాను .. వయసుతో పాటు అనుభవం కూడా వస్తుంది కదా" అంటూ చెప్పుకొచ్చాడు.    
Go Back to Shorts
venu

More Telugu News