మోటోరోలా: మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది!

  • త్వరలో మార్కెట్లోకి మోటోరోలా వన్ పవర్
  • వచ్చే నెల 2న విడుదల 
  • ధర సుమారుగా రూ.24,000గా ఉండవచ్చు

మోటోరోలా కంపెనీ నుండి త్వరలో నూతన స్మార్ట్‌ఫోన్ రానుంది. మోటోరోలా వన్ పవర్ పేరిట ఆగస్టు 2వ తేదీన విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర మన దేశంలో సుమారుగా రూ.24,000గా ఉండవచ్చు. పలు ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలయ్యే ఈ ఫోన్ బ్లాక్, వైట్, గోల్డ్, సిల్వర్ కలర్లలో లభ్యం కానుంది.

మోటోరోలా వన్ పవర్ ప్రత్యేకతలు:


  • వెనక భాగంలో రెండు 16/5 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్  స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 6.18" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4850ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్)

More Telugu News