Telugudesam: ఈ రోజు పుట్టపర్తి సాయిబాబా వేషంలో వచ్చిన టీడీపీ ఎంపీ శివప్రసాద్!

  • పార్లమెంట్ ముందు నిరసన
  • టీడీపీ ఎంపీలతో కలసి పాల్గొన్న శివప్రసాద్
  • ఇచ్చిన మాట నిలుపుకోవాలని హితవు
రాష్ట్ర విభజన తరువాత నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఎదుట రోజుకో వేషంతో నిరసన తెలుపుతున్న టీడీపీ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నేడు పుట్టపర్తి సాయిబాబా వేషంలో వచ్చారు. ఆ వేషధారణలో పార్లమెంటుకు చేరుకున్న ఆయన, మిగతా టీడీపీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ, సత్యము, ధర్మము, న్యాయము వంటి మానవతా విలువలేవీ లేని వ్యక్తి నరేంద్ర మోదీ అని విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న కనీస ధర్మాన్ని ఆయన విస్మరించాడని, సత్యవాక్కును మరచి, ఏపీకి అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నరేంద్ర మోదీ, తన కళ్లు తెరచి, రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తెరగాలని హితవు పలికారు.
Telugudesam
Parliament
Puttaparthi
Satyasai

More Telugu News