mucharla aruna: చిన్నప్పుడు జామకాయలు దొంగతనం చేశాను: ముచ్చర్ల అరుణ

  • నేను పుట్టింది ఖమ్మం దగ్గర కొత్తగూడెంలో 
  • పెరిగింది అంతా హైదరాబాద్ లోనే 
  • ఇక్కడే నా చదువు సాగింది  

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ముచ్చర్ల అరుణ ఎన్నో చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె చాలా సినిమాలే చేసినప్పటికీ, ఆమె పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా .. 'సీతాకోక చిలుక'. ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో, నటిగా తెలుగులో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అలాంటి ముచ్చర్ల అరుణ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

" మాది ఖమ్మం దగ్గర 'కొత్త గూడెం' .. నేను పెరిగిందంతా హైదరాబాద్ లోనే .. ఇక్కడే చదువుకున్నాను. చిన్నప్పటి సంఘటనలను నేను ఇప్పటికీ మరిచిపోలేదు. అప్పుడు నేను ఆరవ తరగతి చదువుతున్నాను. ' ఏవైనా సరే పండ్లు .. దొంగతనం చేసి తింటే అవి మరింత రుచిగా వుంటాయని మా ఇంటికి వచ్చిన వాళ్లు చెప్పుకుంటుంటే విన్నాను. మా పక్కింట్లో పెద్ద జామచెట్టు వుంది. దాంతో ఫ్రెండ్స్ అందరినీ పోగేసి .. వాళ్లు వంగితే వీపు పైకి ఎక్కి పక్కింటిలోని పండ్లు కోసేదానిని. వీపు నొప్పెడుతుందనీ .. త్వరగా దిగమని వాళ్లు అంటున్నా .. నేను జామకాయలు టేస్టు చూస్తూ ఉండేదానిని' అంటూ నవ్వేశారు.   

  • Loading...

More Telugu News