Cheque Bounce: చెక్ బౌన్స్ కేసుల్లో కొత్త చట్టం... బాధితుడికి మొదట్లోనే ఉపశమనం!

  • రోజురోజుకూ పెరుగుతున్న చెక్ బౌన్స్ కేసులు
  • ఏళ్లకు ఏళ్లు సాగుతున్న విచారణ
  • ఇకపై కేసు వేయగానే 20 శాతం కట్టాల్సిందే

దేశవ్యాప్తంగా చెక్ బౌన్సు కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో నెగోషిబుల్ ఇన్ స్ట్రుమెంటల్ యాక్ట్ - 1881కు కీలక సవరణలు చేయగా, ఈ బిల్లును అటు లోక్ సభ, ఇటు రాజ్యసభ ఆమోదించాయి. త్వరలోనే చట్ట రూపం దాల్చనున్న బిల్లు వల్ల చెక్ బౌన్స్ కేసుల విచారణ వేగవంతం అవుతుందని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చెక్ బౌన్సు అయినట్టు కేసు వేస్తే, ప్రస్తుతం దాని పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందన్న సంగతి తెలిసిందే. మారనున్న చట్టం ప్రకారం, చెక్ బౌన్స్ కేసు దాఖలు కాగానే, చెక్కు ఇచ్చిన వ్యక్తి, లేదా సంస్థ 20 శాతం మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సివుంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు 60 రోజుల సమయం ఇస్తారు. కేసు పూర్తయ్యేలోగా కనీసం కొంతైనా బాధితుడికి అందాలన్న ఉద్దేశంతో ఈ మార్పును ప్రతిపాదించారు.

ఇక కింద కోర్టు తీర్పును చెక్ ఇచ్చిన వ్యక్తి పై కోర్టులో సవాల్ చేయాలని భావిస్తే, మరో 20 శాతం మొత్తాన్ని బాధితుడికి చెల్లించాలి. ఇక చెక్ బౌన్స్ కేసును న్యాయమూర్తి కొట్టేసిన పక్షంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.

More Telugu News