karunanidhi: కరుణానిధిని పరామర్శించిన శరద్ పవార్!

  • చెన్నై వెళ్లి కరుణానిధిని పరామర్శించిన ఎన్సీపీ నేత
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవార్
  • కరుణ ఆరోగ్యం కుదుటపడాలని శ్రీలంక అధ్యక్షుడి సందేశం
చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఈరోజు పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్యం గురించి స్టాలిన్, కనిమొళిలను అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని శరద్ పవార్ ఆకాంక్షించారు. ఈ విషయాన్ని శరద్ పవార్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.

కాగా, కరుణానిధి త్వరగా కోలుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఓ సందేశం పంపారు. ఇదిలా ఉండగా, కరుణానిధి అనారోగ్యం నేపథ్యంలో చెన్నైలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
karunanidhi
sharad pawar

More Telugu News