chiranjeevi: 'సైరా' కోసం రెడీ అవుతోన్న విజయ్ సేతుపతి

  • హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి 
  • త్వరలో యూరప్ కి  ప్రయాణం
  • తమిళ .. హిందీ భాషల్లోను రిలీజ్        

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన భార్యగా నయనతార కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మేజర్ షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్లో భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనుంది.ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ .. ఈ సినిమాలో తన పాత్ర తమిళమే మాట్లాడుతూ ఉంటుందని అన్నాడు. త్వరలోనే తన పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ మొదలుకానుందని చెప్పాడు. మరి విజయ్ సేతుపతి .. యూరప్ షెడ్యూల్లో జాయిన్ అవుతాడా? లేదంటే ఆ తరువాత షెడ్యూల్లో కనిపిస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.     

More Telugu News