Ayyanna Patrudu: చంద్రబాబును తిట్టడానికి నోరు ఎలా వస్తుంది? మీరు మనుషులేనా?: అయ్యన్నపాత్రుడు

  • రాజకీయాలను తెలుసుకుని పవన్ మాట్లాడాలి
  • బీజేపీని విమర్శించడం మానేసి చంద్రబాబును తిడుతున్నారు
  • దోపిడీదారులకు అధికారాన్ని ఇస్తే.. రాష్ట్రం నాశనమవుతుంది
ఎదుటి వారిపై బురద చల్లడం మానుకోవాలని, రాజకీయాలను తెలుసుకుని మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి అయ్యన్నపాత్రుడు సూచించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రాన్న మోసం చేస్తున్న బీజేపీని విమర్శించడం మాని జగన్, పవన్ లు ముఖ్యమంత్రి చంద్రబాబును తిడుతున్నారని మండిపడ్డారు.

 రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని... ఆయనను తిట్టడానికి మీకు నోరెలా వస్తోందని... మీరసలు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కుర్చీ కోసం అమలు చేయలేని హామీలన్నీ జగన్ ఇస్తున్నారని.... 40 ఏళ్లకే పింఛన్ ఇస్తామంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దోపిడీదారులు, దొంగలకు అధికారాన్ని అప్పగిస్తే, రాష్ట్రం అధోగతిపాలవుతుందని చెప్పారు. 
Ayyanna Patrudu
Jagan
Pawan Kalyan
Chandrababu

More Telugu News