Rangam: శిక్షించేది, రక్షించేదీ తానేనన్న అమ్మ.. 'రంగం'లో ఉజ్జయిని మహంకాళి!

  • జాతికి రక్షగా ఉంటానన్న అమ్మ
  • సకాలంలో వర్షాలు కురుస్తాయని వరం
  • మహంకాళి ఆలయంలో ముగిసిన రంగం

ఇటీవలి కాలంలో హిందూ మతాన్ని, హైందవ జాతిని కించపరుస్తున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉందని, ఇటువంటి వాళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తావని రంగం వినిపిస్తున్న స్వర్ణలత ముందు ఉంచిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "నేను న్యాయం పక్షానే నిలుస్తాను. ఉజ్జయిని మహంకాళినిరా నేను. ఎవరెన్ని మాటలన్నా జాతికి రక్షగా నేనుంటా. తప్పనిసరిగా శిక్షిస్తా నేను. శిక్షిస్తాను. రక్షిస్తాను కూడా" అని చెప్పింది.

 వర్షాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించగా, "సకాలంలో వర్షాలు... కోరినన్ని వర్షాలు ఉన్నాయిరా బాలకా... ఈ విషయంలో ఎలాంటి ఆపదలూ రావు. కొంగు బంగారం చేసేదాన్ని. తప్పకుండా వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు పండేలా చేసేదాన్ని నేను" అని చెప్పింది. తన ప్రజలు సుఖంగా ఉంటేనే తనకు సంతోషమని వ్యాఖ్యానించింది. దాంతో ఈ సంవత్సరం రంగం పరిసమాప్తమైంది.

More Telugu News