aadi pinishetty: 'నీవెవరో' సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే 'ఓ చెలీ .. ఓ చెలీ ఆశలే ఆవిరే చేశావే ..' సాంగ్

  • హీరోగా ఆది పినిశెట్టి 
  • నాయికలుగా తాప్సీ .. రితికా సింగ్ 
  • ఆకట్టుకుంటోన్న సంగీత సాహిత్యాలు
ఆది పినిశెట్టి కథానాయకుడిగా, తాప్సీ .. రితికా సింగ్ కథానాయికలుగా 'నీవెవరో' సినిమా రూపొందుతోంది. ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హరనాథ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న మాధవన్ చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించారు.  

"ఏమో .. ఏమో .. వున్నావేమో .. ఎదురుచూస్తోంది నా ప్రాణము .. ఎదలో వుంది నీ రూపము, ఏమో .. ఏమో లేవో ఏమో .. మాట దాచింది నీ మౌనము .. అది వింటోంది నా హృదయము .. ఓ చెలీ .. ఓ చెలీ ఆశలే ఆవిరే చేశావే" అంటూ ఈ పాట కొనసాగుతోంది. ప్రియురాలి ఎడబాటును భరించలేని ఓ ఒంటరి మనసు పాడుకునే పాటగా ఇది హృదయాన్ని తాకుతోంది. బాలాజీ సాహిత్యం .. అచ్చు రాజమణి సంగీతం .. కాలభైరవ గానం ఈ పాటకు ఊపిరిపోశాయి. ఈ మధ్య కాలంలో మనసులను తాకే పాటల్లో ఇది ఒకటి అనిపించుకునే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

aadi pinishetty
taapsi
rithika

More Telugu News