tapsee: బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో హీరోయిన్ తాప్సీ నిశ్చితార్థం?

  • ఒలింపిక్స్ మెడలిస్ట్ మాథ్యూస్ తో తాప్సీ ప్రేమాయణం
  • గోవాలో సీక్రెట్ గా నిశ్చితార్థం
  • ఇవన్నీ వదంతులే అన్న తాప్సీ
హీరోయిన్ తాప్సీకి టాలీవుడ్, కోలీవుడ్ లలో అవకాశాలు తగ్గినప్పటికీ... బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఆమె సక్సెస్ ఫుల్ నటిగా రాణిస్తోంది. మరోవైపు ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ ను గెలుచుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్ తో ఆమె ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ముంబైలోని ఓ స్టార్ హోటల్ నుంచి వీరిద్దరూ చేయిచేయి కలుపుకుని బయటకు వచ్చారు.

దీంతో, వీరి ప్రేమాయణంపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. గోవాలో తాప్సీ కుటుంబసభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం నిరాడంబరంగా, సీక్రెట్ గా జరిగిందని చెబుతున్నారు. అయితే, ఈ వార్తలను తాప్సీ ఖండించింది. కుటుంబసభ్యులతో కలసి సరదాగా గోవా వెళ్లామని, నిశ్చితార్థంలాంటివి జరగలేదని ఆమె తెలిపింది.
tapsee
marriage
love
tollywood
bollywood

More Telugu News