kcr: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు

  • ఈరోజు లష్కర్ బోనాలు
  • కేసీఆర్ కు ఘనస్వాగతం పలికిన ఉత్సవ నిర్వాహకులు
  • పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ దంపతులు

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్ కు ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేసీఆర్ వెంట డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే మంత్రి తలసాని కుటుంబసభ్యులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. 

  • Loading...

More Telugu News