karunanidhi: కరుణానిధిని పరామర్శించిన వెంకయ్యనాయుడు

  • చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి వెళ్లిన ఉపరాష్ట్రపతి
  • కరుణానిధి ఆరోగ్య వివరాలపై ఆరా తీసిన వెంకయ్య
  • కరుణానిధిని పరామర్శించిన ‘తృణమూల్’ ఎంపీ  
చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు పరామర్శించారు. కుమారుడు స్టాలిన్ ని అడిగి కరుణానిధి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ  డెరిక్ ఒబ్రెయిన్ కూడా కరుణానిధిని పరామర్శించారు. కాగా, కొన్నిరోజులుగా జ్వరం, మూత్రనాళం ఇన్ ఫెక్షన్ తో  కరుణానిధి బాధపడుతున్నారు. గత శుక్రవారం అర్ధరాత్రి కరుణానిధి బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన్ని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
karunanidhi
Venkaiah Naidu

More Telugu News