Kiki: 'కికి' చాలెంజ్ ని స్వీకరించిన అదా శర్మ... వైరల్ వీడియో!

  • ప్రమాదకరమని పోలీసుల హెచ్చరిక
  • వినకుండా స్వీకరిస్తున్న నెటిజన్లు
  • అదా శర్మ డ్యాన్స్ వీడియో వైరల్

ఇటీవలి కాలంలో దూసుకొచ్చిన 'కికి' చాలెంజ్ ప్రమాదకరమని, దీని జోలికి పోవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా, ఈ చాలెంజ్ ని స్వీకరిస్తున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా 'కికి' చాలెంజ్ స్వీకరించిన వారి జాబితాలో హీరోయిన్ అదా శర్మ కూడా చేరిపోయింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తన కారులో నుంచి దిగి డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను పంచుకుంది. తెలుగులో 'క్షణం' చిత్రంలో నటించిన ఈ భామ, తన సోషల్ మీడియా ఖాతాల్లో జిమ్ వీడియోలను, డ్యాన్స్ వీడియోలను పోస్టు చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. అదా శర్మ 'కికి' వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News