Tollywood: 'శతదినోత్సవం'లో మహేష్, చరణ్ సినిమాల హంగామా!

  • 100 రోజులు ఆడిన 'భరత్ అనే నేను', 'రంగస్థలం'
  • 6 కేంద్రాల్లో ఆడిన మహేష్ బాబు చిత్రం
  • 15 కేంద్రాల్లో రామ్ చరణ్ సినిమా వంద రోజులు

ఈ సంవత్సరం రెండు వారాల వ్యవధిలో విడుదలై, సూపర్ హిట్స్ గా నిలిచిన మహేష్ బాబు 'భరత్ అనే నేను', రామ్ చరణ్ 'రంగస్థలం' చిత్రాలు రెండూ శతదినోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. పెరిగిన థియేటర్ల సంఖ్య కారణంగా, ఓ చిత్రం విడుదలైన తరువాత, అతి తక్కువ రోజుల్లోనే కలెక్షన్స్ సాధించి థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. కానీ, ఈ రెండు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ థియేటర్లలో భారీ కలెక్షన్లను రాబట్టాయి.

రామ్ చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' ఓ అద్భుతమైన హిట్ గా నిలువగా, మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన 'భరత్ అనే నేను' బ్యూటిఫుల్ మూవీగా నిలిచింది. ఈ రెండూ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి వారి అభిమానులు ఏ సినిమా ఎక్కువ సెంటర్లలో శతదినోత్సవాన్ని జరుపుకుందన్న లెక్కలు వేస్తున్నారు. 'భరత్ అనే నేను' 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, 'రంగస్థలం' 15 కేంద్రాల్లో ఈ ఘనతను సాధించింది. దీంతో ప్రిన్స్ పై చెర్రీదే పైచేయని మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  

More Telugu News