Maharashtra: మహారాష్ట్రలో లోయలోపడ్డ బస్సు.. 33 మంది దుర్మరణం!

  • బస్సుపై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
  • సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు
  • మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

ఓ డ్రైవర్ తప్పిదం కారణంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 33 మంది ప్రాణాలు గాల్లో కలసిపోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దపోలీలోని డా.బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ కు చెందిన 40 మంది సిబ్బంది ఈ రోజు విహారయాత్రలో భాగంగా మహాబలేశ్వరంకు బయలుదేరారు. అయితే వీరు మాట్లాడుకున్న ప్రైవేటు బస్సు అంబేనాలీ ఘాట్ ప్రాంతంలో రోడ్డుపై ఓ మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి 500 అడుగుల లోతున్న లోయలోకి జారిపోయింది. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జు కావడంతో 32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారు గాయాలపాలయ్యారు.


ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఓ వ్యక్తి లోయ నుంచి రోడ్డుపైకి ఎక్కి వచ్చి సమాచారం అందించాడు. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News